సైబర్ నేరగాళ్ల సైకాలజికల్ గేమ్.. జీరోకు మీ బ్యాంక్ బ్యాలెన్స్! సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్, 18 జనవరి (హి.స.) సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు ఉచితంగా 5 వేలంటూ ఎర వేస్తున్నారు. సైకాలజికల్ గేమ్ తో ప్రజలను దోచుకునేందుకు లింక్ లు రూపొందించి పంపిస్తు కొల్లగొడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఉచితంగా నగదు అనగానే ఆ లింక్ లను
సైబర్ ఫ్రాడ్


హైదరాబాద్, 18 జనవరి (హి.స.)

సైబర్ నేరగాళ్లు అమాయకులను

బురిడీ కొట్టించేందుకు ఉచితంగా 5 వేలంటూ ఎర వేస్తున్నారు. సైకాలజికల్ గేమ్ తో ప్రజలను దోచుకునేందుకు లింక్ లు రూపొందించి పంపిస్తు కొల్లగొడుతున్నారు. కాబట్టి ఇలాంటి ఉచితంగా నగదు అనగానే ఆ లింక్ లను క్లిక్ చేయవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఈ నేర ప్రక్రియకు సంబంధించిన వివరాలను సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికతో పాటు ప్రకటనలో ఆదివారం పంచుకున్నారు. మొదట ఇది నకిలీ అనుకున్నాను.. కానీ నిజంగానే నాకు రూ.5 వేలు వచ్చింది. మీరు కూడా చూడండి అంటూ ఒక లింక్ ఇప్పుడు వాట్సాప్ లతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల మీదుగా షేర్ అవుతుంది.

ఈ లింక్ ను అసలు టచ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ లింక్ కు ఆశలో ముంచేందుకు ఇది ఫోన్ -పే సంక్రాంతి, రిపబ్లిక్ డే ఆఫర్, గిఫ్ట్ లంటూ మాయ చేస్తున్నారు. ఈ లింక్ లలో వైరస్ మాల్ వేర్ లను పొందుపర్చి వాటిని ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ఈ లింక్ ను క్లిక్ చేయగానే అందులో ఉండే మాల్ వేర్ మీ ఫోన్ లోకి ప్రవేశించి మొత్తం కంట్రోల్ ను సైబర్ నేరగాళ్లకు ఇచ్చేస్తుందని పోలీసులు వారిస్తున్నారు. అవి కనపడగానే వెంటనే ఆ లింక్ లను డిలీట్ చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande