
నల్గొండ, 18 జనవరి (హి.స.)
మునుగోడు నియోజకవర్గంలో
కొనసాగుతున్న మద్యం షాపుల సమయపాలన, మద్యం నియంత్రణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలవడానికి వచ్చిన కొంతమంది మద్యం వ్యాపారులతో మద్యం షాపుల సమయపాలన పై వెనకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. మీ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యాలు పాడు చేయొద్దని, ఉదయం నుంచి మద్యం తాగే విధానానికి స్వస్తి పలికేలా మద్యం వ్యాపారులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల విషయంలో తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్ షాపులు తెరుచుకోవాలని 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లో అనుమతి ఉండాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు