ఇండిగో విమాన సర్వీసుల అంతరాయంపై డీజీసీఏ కీలక ఆదేశాలు
హైదరాబాద్, 18 జనవరి (హి.స.) గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన భారీ అంతరాయంపై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ జారీ చేసిన ఆదేశాలను అందుకున్నట్లు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Indigo) బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో
ఇండిగో విమాన


హైదరాబాద్, 18 జనవరి (హి.స.)

గత ఏడాది డిసెంబర్ మొదటి

వారంలో ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన భారీ అంతరాయంపై భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ జారీ చేసిన ఆదేశాలను అందుకున్నట్లు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Indigo) బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నియంత్రణ సంస్థ సూచించిన నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, సంబంధిత అంశాలపై త్వరితగతిన తగిన చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్, డైరెక్టర్ల బోర్డు ఈ సందర్భంగా వాటాదారులకు, ప్రయాణికులకు హామీ ఇచ్చారు.

సర్వీసుల వైఫల్యానికి దారితీసిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తమ అంతర్గత వ్యవస్థల సామర్థ్యాన్ని, పటిష్టతను పెంచేందుకు సమగ్ర సమీక్షను ఇప్పటికే ప్రారంభించినట్లు ఇండిగో పేర్కొంది. సుమారు 19 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తమ సంస్థ, ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పటిష్టంగా ఎదగాలని భావిస్తోంది. 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా మార్చడంలో తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని యాజమాన్యం ఈ సందర్భంగా తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande