
కాకినాడ 17 జనవరి (హి.స.)జిల్లాలోని తుని ప్రాంతంలో వైసీపీ నేతలు బరితెగించారు. కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో కనుమ పండుగ రోజు ఘోరం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న టీడీపీ నేతలపై కొందరు వైసీపీ కార్యకర్తలు విచక్షణా రహితంగా దాడి చేశారు. మాటువేసి మరీ కత్తులు, ఇనుప రాడ్లతో ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ