
మహబూబ్నగర్, 17 జనవరి (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఎంవీఎస్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదని అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. 'ఈ వేదికపై ఉన్నవాళ్లంతా నా ఓటమికి గట్టిగా పనిచేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం. కేంద్రం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తా. కేంద్రం, రాష్ట్ర నిధులు కలిసి ఉపయోగించుకోవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు