
తెలంగాణ, 17 జనవరి (హి.స.)
సోషల్ మీడియాలో లక్కీ డ్రాల
పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. రీల్స్లో ఆడంబరమైన బిల్డప్ ఇచ్చి, రియాలిటీలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు వంటి విలువైన బహుమతులు ఇస్తామంటూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు.
అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తూ నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తప్పవని సజ్జనార్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు