'కమ్యూనిజం అజరామరం.. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని
ఖమ్మం, 17 జనవరి (హి.స.) ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాటాలు మరింత ఉధృతంగా చేయాలని, అందుకు అనుగుణంగా తమ పంథా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కారదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిజం అజరామరమని, వందేళ్ల ప
సిపిఐ ఎమ్మెల్యే


ఖమ్మం, 17 జనవరి (హి.స.)

ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాటాలు మరింత ఉధృతంగా చేయాలని, అందుకు అనుగుణంగా తమ పంథా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కారదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిజం అజరామరమని, వందేళ్ల పాటు పార్టీ బతికి ఉందంటే ప్రజలు తమపై పెట్టిన బాధ్యత అని, ఈ వందేళ్ల వేడుకను ఆదివారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తిచేశామని వెల్లడించారు.

శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'మీట్ ద 'ప్రెస్' కార్యక్రమానికి హాజరై జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే సంఘాలు, ఆయా రంగాల్లో చట్టాలు రూపొందించబడ్డాయని, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయా సంఘాలకు కమ్యూనిస్టుల మద్దతు ఉంటుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande