
హైదరాబాద్, 17 జనవరి (హి.స.)
వెనెజువెలా పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుశ్చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించాలని సీపీఐ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ సర్కార్ అర్థం లేని విదేశాంగ విధానాల వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిందని అన్నారు. కానీ, నక్సలిజాన్ని అణిచివేయడం సాధ్యం కాదని కామెంట్ చేశారు. దండకారణ్యాల్లో విచ్చలవిడిగా బూటకపు ఎన్ కౌంటర్లకు తెగబడుతూ.. అక్కడున్న విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..