ఎల్బీ నగర్ జోన్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) మల్కాజిగిరి కమిషనరేట్లోని ఎల్బీ నగర్ డీసీపీ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్ల లిమిట్స్లో శనివారం ఒకేసారి మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం సృష్టించాయి. హయత్నగర్ అంజనాద్రి నగర్ విజయ అనే మహిళ మెడలో నుంచి బైక్పై వచ్చిన ఇద
చైన్ స్నాచర్లు..


హైదరాబాద్, 17 జనవరి (హి.స.)

మల్కాజిగిరి కమిషనరేట్లోని ఎల్బీ నగర్ డీసీపీ పరిధిలో మూడు పోలీస్ స్టేషన్ల లిమిట్స్లో శనివారం ఒకేసారి మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం సృష్టించాయి.

హయత్నగర్ అంజనాద్రి నగర్ విజయ అనే మహిళ మెడలో నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు స్నాచర్లు 3.3 తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు.

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లైండ్స్ కాలనీలో తన కుమారుడు (సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు) వద్దకు వెళ్తున్న మణెమ్మ (58)ను వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం కాలనీలో కిరాణా షాపుకు వెళ్తున్న ఆదిలక్ష్మి (40) అనే మహిళ మెడలో నుంచి బైక్పై వచ్చిన దుండగులు ఒకటిన్నర తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande