మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు ఎన్ కౌంటర్!
చత్తీస్గడ్, 17 జనవరి (హి.స.) మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ ఛత్తీస్ గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్టు పార్టీ దండకారణ్
ఎన్కౌంటర్


చత్తీస్గడ్, 17 జనవరి (హి.స.)

మావోయిస్టు పార్టీకి మరో భారీ

ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ ఛత్తీస్ గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (డీకేఎసీడీసీఎం) పాపారావు అలియాస్ మోంగు (57) మరణించారు. పాపారావు దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు.

ఛత్తీస్గఢ్లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు.. మాడ్వి హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఇతడు ఒకడిగా కొనసాగుతున్నారు. కాగా పాపారావు పై కోటి రూపాయల రివార్డ్ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande