రిపబ్లిక్ డే వేళ రాష్ట్రాలకు అలర్ట్.. ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాల హెచ్చరికలు
న్యూఢిల్లీ, 17 జనవరి (హి.స.) దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ లో భారీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26 వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర సంస్థలు దాడులకు కుట్ర పన్నుతున్నట్ల
ఢిల్లీ హై అలర్ట్


న్యూఢిల్లీ, 17 జనవరి (హి.స.)

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ

వేడుకలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ లో భారీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26 వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర సంస్థలు దాడులకు కుట్ర పన్నుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో తలదాచుకుంటున్న ఖలిస్థానీ ఉగ్రవాదులు, బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్ర ముఠాలు ఈసారి స్థానిక గ్యాంగ్టర్ల ద్వారా దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. రాజధాని ఢిల్లీనే కాకుండా ఢిల్లీ మాత్రమే కాకుండా, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రమూకలు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిగే ప్రమాదం ఉందని, ముఖ్యంగా రెడ్ ఫోర్ట్, కర్తవ్య పథ్ పరిసరాల్లో నో-ఫ్లై జోన్లను పటిష్ఠం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. నగర వ్యాప్తంగా దాదాపు 20 వేల మందితో అదనపు బలగాలను మోహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande