
Lజోగులాంబ గద్వాల, 17 జనవరి (హి.స.)
పురపాలిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని జోగులాంబ జిల్లాలో నాలుగు మునిసిపాలిటీలకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో డిప్ ద్వారా గద్వాల, ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన మహిళ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రిజర్వేషన్లను డిప్ విధానంలో ఖరారు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు