
హైదరాబాద్, 17 జనవరి (హి.స.)రాజధాని అమరావతి అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) పిలుపునకు 29వేల మంది రైతులు ముందుకు వచ్చి 33వేల ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన అని మంత్రి అన్నారు. 2014లో అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చిన జగన్ రెడ్డి.. 2019 ఎన్నికల ముందు అక్కడే ఇల్లు కట్టుకున్నానని ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక దానిని నాశనం చేయడం ఘోరమైన నమ్మకద్రోహమని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో జగన్ రెడ్డి ఐదేళ్లు కాలయాపన చేసి, ఒక్క రాజధానినైనా నిర్మించకుండా రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని.. ఇది తుగ్లక్ పాలనకు సమానమని మంత్రి విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు