
హైదరాబాద్, 17 జనవరి (హి.స.)
జిల్లాల పునర్విభజన పేరుతో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న వేళ ఈ ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్ పై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ అస్తిత్వానికి ఎలాంటి భంగం కలగదన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్తో మాట్లాడిన ఆయన.. 33 జిల్లాలు ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం సికింద్రాబాద్ను ఎందుకు జిల్లా చేయలేదని ప్రశ్నించారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశాని విమర్శించిన మంత్రి ఏ నిర్ణయమైనా అందరి అభిప్రాయం మేరకే తీసుకుంటామన్నారు. హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని మరోసారి స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..