నా ఇల్లు కూల్చిన వారికి ప్రజలే బుద్ధి చెప్పారు.. బీఎంసీ ఫలితాలపై కంగనా రనౌత్ హర్షం
ముంబై, 17 జనవరి (హి.స.) మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో, ముఖ్యంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో తన కార్యాలయాన్ని కూల్చివేసిన ఉద్దవ్
కంగనా రనౌత్


ముంబై, 17 జనవరి (హి.స.)

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో, ముఖ్యంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో తన కార్యాలయాన్ని కూల్చివేసిన ఉద్దవ్ ఠాక్రే వర్గంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా బీఎంసీ ఫలితాలపై ఆమె ఒక వీడియో విడుదల చేశారు. నన్ను వేధించి, నా బంగ్లాను కూల్చివేసి, నన్ను ముంబయి వదిలి వెళ్లాలని బెదిరించిన వారిని ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలే సాగనంపారు అని కంగనా వ్యాఖ్యానించారు. మహిళా వ్యతిరేక 'బంధుప్రీతి మాఫియా'కు ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారని ఆమె ఎద్దేవా చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande