తెలంగాణలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. రిజర్వేషన్లకు సంబంధ
రిజర్వేషన్


హైదరాబాద్, 17 జనవరి (హి.స.)

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల

నగారా మోగింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.

రిజర్వేషన్లకు సంబంధించి వివరాలను ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అఫీషియల్గా ప్రకటించారు.

కొత్తగూడెం కార్పొరేషన్కు ఎస్సీకి రిజర్వ్ చేశారు. రామగుండం కార్పొరేషన్కు ఎస్సీ జనరల్, మహబూబ్నగర్ కార్పొరేషన్కు బీసీ మహిళకు అవకాశం కల్పించారు. మంచిర్యాల కార్పొరేషన్కు బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్కు బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. అదేవిధంగా 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు, 61 అర్రిజర్వ్ పెట్టారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande