
అమరావతి, 17 జనవరి (హి.స.),:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు మరో జాతీయ అవార్డు దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా బస్టాప్‌లలో ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ (AAS) విజయవంతంగా అమలు చేసినందుకు గానూ ఏపీఎస్ఆర్టీకి ప్రతిష్టాత్మకమైన గవర్నెన్స్ నౌ – 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్ అవార్డ్ వరించింది. ఈ అవార్డు ద్వారా ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించిన ఏపీఎస్ఆర్టీసీ కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ