
హైదరాబాద్, 17 జనవరి (హి.స.)
జనవరి 18 ఆదివారం రోజున మేడారంలో సమ్మక్క-సారక్క సన్నిధిలో జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని TGSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (SWU INTUC) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సమస్యలు పరిష్కరించకపోతే దీక్షకు నిరవధిక నిరాహార దిగుతామని యూనియన్ హెచ్చరించింది. గత ఆరు ఏళ్లుగా ఆర్టీసీలో కార్మిక సంఘాలకు అనుమతి లేకపోవడంతో పనిభారం, వేధింపులు పెరిగాయని యూనియన్ తెలిపింది. 2021 నుంచి పెండింగ్లో ఉన్న పే స్కేల్, 2025లో రావాల్సిన రెండో పే స్కేల్, ఆర్టీసీ కార్మికుల విలీనం ప్రక్రియ పూర్తి చేయడం, అపాయింటెడ్ డే ప్రకటించడం వంటి అంశాలను క్యాబినెట్లో నిర్ణయించాలని డిమాండ్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..