రోహిత్ వేముల మరణించి నేటికి పదేళ్లు.. వర్ధంతి సందర్భంగా రాహుల్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘన నివాళి అర్పించారు. శనివారం ''ఎక్స్'' (ట్విట్టర్) వేదికగా ఆయన స్పం
రాహుల్ గాంధీ


హైదరాబాద్, 17 జనవరి (హి.స.)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘన నివాళి అర్పించారు. శనివారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో 'రోహిత్ వేముల చట్టం' (Rohit Vemula Act) తీసుకురావాల్సిన అవసరం ఉందని మరో సారి నొక్కి చెప్పారు. తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని త్వరలోనే అమలు చేసే దిశగా ప్రక్రియను మొదలుపెట్టాయని రాహుల్ కీలక ప్రకటన చేశారు. 'రోహిత్ వేముల మనల్ని విడిచి వెళ్లి నేటికి పదేళ్లు పూర్తయింది. కానీ, ఈ దేశంలో కలలు కనే హక్కు అందరికీ సమానంగా ఉందా? అనే రోహిత్ ప్రశ్న నేటికీ మన గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది' అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande