జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం.. ఒకరు మృతి
మేడ్చల్, 17 జనవరి (హి.స.) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై డబిల్పూర్ కమాన్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ ఆటోను ఢీకొ
రోడ్డు ప్రమాదం


మేడ్చల్, 17 జనవరి (హి.స.)

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని

జాతీయ రహదారిపై డబిల్పూర్ కమాన్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయి, డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంతో ఎల్లంపేట నుంచి కల్కల్ వరకు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande