
సంగారెడ్డి, 17 జనవరి (హి.స.)
సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు
మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. సంగారెడ్డి జనరల్ మహిళ, సదాశివపేట కూడా జనరల్ మహిళగా కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ముందుగా బీసీ మహిళ లేదా ఎస్సీ కేటగిరీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు