పాఠశాలకు వెళుతూ ప్రమాదానికి గురైన టీచర్లు.. ఇద్దరు మృతి
సూర్యాపేట., 17 జనవరి (హి.స.) సంక్రాంతి సెలవుల అనంతరం విధుల్లో చేరేందుకు వెళ్తున్న ఉపాధ్యాయులను మృత్యువు కబళించింది. నల్లగొండ నుంచి తుంగతుర్తికి కారులో వెళ్తుండగా అర్వపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గా
టీచర్స్ ప్రమాదం


సూర్యాపేట., 17 జనవరి (హి.స.)

సంక్రాంతి సెలవుల అనంతరం విధుల్లో చేరేందుకు వెళ్తున్న ఉపాధ్యాయులను మృత్యువు కబళించింది. నల్లగొండ నుంచి తుంగతుర్తికి కారులో వెళ్తుండగా అర్వపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండకు చెందిన నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిరోజూ తుంగతుర్తికి వెళ్లి వస్తుంటారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో శనివారం ఉదయం వీరంతా కారులో విధులకు బయలుదేరారు. మార్గమధ్యలో సూర్యాపేట జిల్లా అర్వపల్లి వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన రావులపల్లి జీహెచ్ఎం గీత చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ప్రవీణ్, సునీతలకు తీవ్ర గాయాలయ్యాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande