సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గృహ నిర్బంధం..
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) సికింద్రాబాద్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లష్కర్ జిల్లా సాధన కోసం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి శాంతి ర్యాలీలో పాల్గొనవలసిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ను పోలీసులు గృహ నిర్బ
ఎమ్మెల్యే పద్మారావు


హైదరాబాద్, 17 జనవరి (హి.స.)

సికింద్రాబాద్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లష్కర్ జిల్లా సాధన కోసం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి శాంతి ర్యాలీలో పాల్గొనవలసిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఉదయం నుంచే పద్మారావు గౌడ్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రధాన ద్వారాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ఆయన బయటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు నోటీసులు జారీ చేశారు. గృహ నిర్బంధం పై పద్మారావు గౌడ్ తీవ్రంగా స్పందించారు. తన నివాసం నుంచే మీడియా ద్వారా మాట్లాడుతూ ప్రజాసమస్యల పై గొంతు ఎత్తుతుంటే ప్రభుత్వం పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. సికింద్రాబాద్ ప్రజల ఆకాంక్షను గౌరవించి లష్కర్ను జిల్లాగా ప్రకటించే వరకు మా పోరాటం ఆగదు, అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరని ధ్వజమెత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande