అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వం ఈ మూడు అంశాలే బీజేపీ ఎన్నికల ఎజెండా.. బండి సంజయ్
హైదరాబాద్, 17 జనవరి (హి.స.) రాబోయే మన్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో శనివారం జరిగిన ''బీజేపీ మున్సి
బండి సంజయ్


హైదరాబాద్, 17 జనవరి (హి.స.)

రాబోయే మన్సిపల్ ఎన్నికల్లో

కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో శనివారం జరిగిన 'బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం'లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande