
వనపర్తి, 17 జనవరి (హి.స.)
సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మీ షాది
ముబారక్ చెక్కుల విషయంలో పైరవీ కారులను నమ్మి లబ్దిదారులు మోసపోకూడదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. శనివారం వారు క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. వనపర్తి మండలం, పట్టణానికి సంబంధించి 36 మంది లబ్ధిదారులకు, పెబ్బేరు పట్టణం, మండలం లబ్ధిదారులకు మంజూరైన 36 చెక్కులను మొత్తం 72 చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు