గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి, 17 జనవరి (హి.స.) కాకినాడలో సిద్ధమవుతున్న గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ (Green Ammonia Project) కార్యక్రమంపై సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ
Lokesh


అమరావతి, 17 జనవరి (హి.స.)

కాకినాడలో సిద్ధమవుతున్న గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ (Green Ammonia Project) కార్యక్రమంపై సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2024 అక్టోబరులో ఏపీ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం ప్రారంభించేటప్పుడు తమ లక్ష్యాన్ని తెలిపామన్నారు. ఏపీని భారత గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్ట్ మైలురాయిగా నిలుస్తుందన్నారు. తద్వారా గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశలో మరో కీలక అడుగు ఏపీ ముందుకు వేసిందన్నారు..

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande