ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. తొమ్మిది దాటినా కనిపించని సూరీడు!
ఢిల్లీ, 17 జనవరి (హి.స.) దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. దీంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెల
ఢిల్లీ


ఢిల్లీ, 17 జనవరి (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. దీంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గాలిలో కాలుష్యం మరింత పెరగడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘వెరీ పూర్’ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో GRAP-III కింద ఆంక్షలను మళ్లీ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిర్మాణ కార్యకలాపాలపై పరిమితులు విధించడంతో పాటు, డీజిల్ వాహనాల వినియోగాన్ని నియంత్రిస్తున్నారు. AIIMS పరిసర ప్రాంతాల్లో డ్రోన్ విజువల్స్‌లో పొగమంచు తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోనూ నెలకొంది. నోయిడా సెక్టర్-115 ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande