
అమరావతి, 17 జనవరి (హి.స.)
భారతరత్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత పురచ్చి తలైవర్ ఎం.జి. రామచంద్రన్ (MGR) 109వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళ చిత్రసీమలో నూతన ఒరవడిని సృష్టించి, తన జీవితాన్ని సామాన్యుల సంక్షేమం కోసం అంకితం చేసిన దార్శనిక నేత ఎంజీఆర్ అని కొనియాడారు. అధికారం అనేది కేవలం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడినప్పుడే దానికి నిజమైన అర్థం లభిస్తుందని ఎంజీఆర్ నిరూపించారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజకీయాల కంటే ప్రజలకు, సౌకర్యం కంటే న్యాయానికి పెద్దపీట వేస్తూ ఆయన అందించిన పాలన నేటికీ ఆదర్శప్రాయమని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV