ల్యాండ్ టైటిలింగ్ పేరుతో గత ప్రభుత్వం కుట్ర చేసింది
నెల్లూరు, 17 జనవరి (హి.స.) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) పేరుతో గత వైసీపీ (YCP) ప్రభుత్వం ఏపీ ప్రజలపై కుట్ర చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) ఆరోపించారు. నెల్లూరు జిల్లా పరిధిలోని అ
/the-previous-government-conspired-in-the-name-of-la


నెల్లూరు, 17 జనవరి (హి.స.)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) పేరుతో గత వైసీపీ (YCP) ప్రభుత్వం ఏపీ ప్రజలపై కుట్ర చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy) ఆరోపించారు.

నెల్లూరు జిల్లా పరిధిలోని అనంతసాగరం మండలంలో ఉన్న ఉప్పలపాడు గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా రైతులకు రాజముద్ర కలిగిన పట్టా పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో ఇప్పటికే 5,486 పట్టా పాసు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వంలో పట్టా పాసు పుస్తకాలపై వైయస్ జగన్ బొమ్మ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు యత్నించారని విమర్శలు గుప్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande