మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి.ప్రభుత్వం.స్వాధీనం
, హైదరాబాద్‌:, 18 జనవరి (హి.స.) మెట్రోరైలును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకపక్క కొనసాగుతుండగా... మరోవైపు రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రోరైళ్ల కొనుగోలుపై హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) దృష్టి సారించింది.
మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి.ప్రభుత్వం.స్వాధీనం


, హైదరాబాద్‌:, 18 జనవరి (హి.స.)

మెట్రోరైలును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకపక్క కొనసాగుతుండగా... మరోవైపు రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రోరైళ్ల కొనుగోలుపై హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌(హెచ్‌ఎంఆర్‌ఎల్‌) దృష్టి సారించింది. పది రైళ్లను కొనాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుతం మూడు కోచ్‌ల రైళ్లు ఉన్నాయి. కొత్తగా కొనాలని ప్రతిపాదించినవి ఆరు కోచ్‌లవని అధికారులు తెలిపారు. సర్కారు నుంచి అనుమతి రాగానే కొనుగోళ్లకు టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు....:ఆరు కోచ్‌ల కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తే రద్దీని తట్టుకునేందుకు సరిపోతాయి. మెట్రో స్వాధీనం వరకు వేచిచూడకుండా సర్కారు అనుమతిస్తే ముందుగానే టెండర్లకు వెళ్లే ఆలోచనలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande