త్వరలో మరో.700.అన్న క్యాంటీన్లు ప్రారంభం
అమరావతి, 18 జనవరి (హి.స.)తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. అప్పట్లో ''మదరాసి'' అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటుందని ప్రపంచానికి గుర్తుచేసిన వ్యక్తి ఎన్టీఆర్
త్వరలో మరో.700.అన్న క్యాంటీన్లు ప్రారంభం


అమరావతి, 18 జనవరి (హి.స.)తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. అప్పట్లో 'మదరాసి' అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటుందని ప్రపంచానికి గుర్తుచేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ రాకముందు చదువు లేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండేవారని గుర్తు చేశారు. చదువుకున్నవారికే ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. ఈ ఉగాదికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. సమర్థవంతంగా సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చినమాట ప్రకారం.. ఈ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మన పూర్వీకుల భూమికి గత పాలకుల ఫొటోలు పెట్టుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande