విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు ఆలస్యం
గన్నవరం, 19 జనవరి (హి.స.) విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. విమానాశ్రయంతో పాటు రన్‌వేను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో సోమవారం ఉదయం చేరుకోవాల్సిన హైదరాబాద్‌, చెన్నై
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు ఆలస్యం


గన్నవరం, 19 జనవరి (హి.స.)

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. విమానాశ్రయంతో పాటు రన్‌వేను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో సోమవారం ఉదయం చేరుకోవాల్సిన హైదరాబాద్‌, చెన్నై ఇండిగో సర్వీసులు, దిల్లీ నుంచి రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం గంట ఆలస్యమయ్యాయి. ఉదయం 9.55 గంటలకు రావాల్సిన విశాఖపట్నం ఇండిగో సర్వీస్‌ రద్దయినట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande