బిజెపి నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం
న్యూఢిల్లీ, 19 జనవరి (హి.స.) బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. ప్రస్త
బిజెపి కొత్త అధ్యక్షుడు


న్యూఢిల్లీ, 19 జనవరి (హి.స.)

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. ప్రస్తుతం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నితిన్ నబీన్ రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నితిన్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఇతర అగ్రనేతలు హాజరయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande