సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుమానాస్పద మృతి
పీలేరు, 18 జనవరి (హి.స.) సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో కలకలకం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండవంటిపల్లెకి చెందిన ఆరుగ
సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుమానాస్పద మృతి


పీలేరు, 18 జనవరి (హి.స.)

సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో కలకలకం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండవంటిపల్లెకి చెందిన ఆరుగురు యువకులు శనివారం మద్యం తాగేందుకు గ్రామశివారుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మణి (35), పుష్పరాజ్‌ (27) అస్వస్థతకు గురయ్యారు. అనంతరం వీరిని పీలేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మణి చెన్నైలో, పుష్పరాజ్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. మణికి భార్య, కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్‌కి ఇంకా వివాహం కాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande