రెహ్మాన్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఫైర్..
హైదరాబాద్, 18 జనవరి (హి.స.) లెజెండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ చేసిన మతపరమైన వివక్ష వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రంగంలోకి దిగారు. రెహ్మాన్ను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ
రనౌత్ ఫైర్..


హైదరాబాద్, 18 జనవరి (హి.స.) లెజెండరీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ చేసిన మతపరమైన వివక్ష వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రంగంలోకి దిగారు. రెహ్మాన్ను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. జనవరి 17న తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రెహ్మాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాలీవుడ్లో తనకు ఎదురవుతున్న పరిస్థితులపై స్పందిస్తూ, రెహ్మాన్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఆమె ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు.

ఇటీవల రెహ్మాన్ బాలీవుడ్లో మతపరమైన పక్షపాతం ఉందని, ఆ కారణంగానే తనకు అవకాశాలు తగ్గుతున్నాయనే భావన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కంగనా, తన రాజకీయ భావజాలం కారణంగా తాను కూడా ఇండస్ట్రీలో వివక్షను ఎదుర్కొంటున్నానని అన్నారు. నేను ఒక రాజకీయ పార్టీకి (బీజేపీకి) మద్దతు ఇస్తున్నందున నాకు అన్యాయం జరుగుతోంది. కానీ మీకంటే ఎక్కువ పక్షపాతంతో, ద్వేషంతో వ్యవహరించే వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు అంటూ రెహ్మాన్పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande