నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషల శిక్షణ: సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం, 18 జనవరి (హి.స.) తెలంగాణలో నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జపాన్, జర్మనీ దేశాల్లో నర్సింగ్ రంగానికి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో, నర్సింగ్ విద్యతో పాటు జపనీస
సీఎం రేవంత్ రెడ్డి


ఖమ్మం, 18 జనవరి (హి.స.)

తెలంగాణలో నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జపాన్, జర్మనీ దేశాల్లో నర్సింగ్ రంగానికి అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో, నర్సింగ్ విద్యతో పాటు జపనీస్, జర్మన్ భాషల శిక్షణను కూడా అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లా కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

విద్య, ఆరోగ్య రంగాలను ప్రభుత్వ ప్రాధాన్య రంగాలుగా తీసుకుని మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన శిక్షణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని, కొత్త ఆసుపత్రులు, విద్యాసంస్థల ప్రారంభం ద్వారా ఆ దిశగా ముందడుగు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande