అమెరికా ముందు ప్రధాని మోడీ తలవంచారు: సీపీఐ నేత డి.రాజా
ఖమ్మం, 18 జనవరి (హి.స.) సీపీఐ(CPI) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఆదివారం భారీ బహిరంగ సభఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా(D.Raja) మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సీపీఐ పార్టీ పాలు పంచుకుందని తెలిపార
సిపిఐ లీడర్ రాజా


ఖమ్మం, 18 జనవరి (హి.స.)

సీపీఐ(CPI) శతాబ్ది ఉత్సవాల

సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఆదివారం భారీ బహిరంగ సభఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా(D.Raja) మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సీపీఐ పార్టీ పాలు పంచుకుందని తెలిపారు. స్వాంతంత్ర్య సాధన కోసం సీపీఐ శ్రేణులు భారీగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు. స్వాంతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదని అన్నారు. ఆంగ్లేయులతో ఆర్ఎస్ఎస్ చేతులు కలిపిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అమెరికా ముందు తలవంచారు. భారత దేశ అభివృద్ధి కోసం మోడీ చేసింది ఏమీ లేదు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఇంకా ఉన్నారు. ట్రంప్ దమ్ముంటే నా దేశంపై పెత్తనం చేయండి' అని డి.రాజా వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande