'బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి.. నాయకులు గద్దెలు దిగాలి': సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం, 18 జనవరి (హి.స.) తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ను వంద మీటర్ల గోయ్యి తీసి పాతిపెట్టాలని, బీఆర్ఎస్ నాయకులు గద్దెలు దిగాలి... ఊళ్లల్లో ఆ పార్టీ దిమ్మెలు కూలాలన
సీఎం రేవంత్ రెడ్డి


ఖమ్మం, 18 జనవరి (హి.స.)

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ను వంద మీటర్ల గోయ్యి తీసి పాతిపెట్టాలని, బీఆర్ఎస్ నాయకులు గద్దెలు దిగాలి... ఊళ్లల్లో ఆ పార్టీ దిమ్మెలు కూలాలని, అప్పుడే నందమూరి తారక రామారావుకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన నివాళులర్పించినవారమవుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఆదివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నేరు లింక్ కెనాల్, జేఎన్టీయూ, నర్సింగ్ కళాశాలలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలను చేసి ప్రసంగించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande