
హైదరాబాద్, 18 జనవరి (హి.స.)
కోదాడలో జరిగిన దళిత యువకుడు
కర్ల రాజేష్ లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు కవిత ఎక్స్ లో రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలీసు కస్టడీలో కొడుకును కోల్పోయిన తల్లి రోదనను వినాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత దళితులపై దాడులు పెరుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యిందని రోహిత్ వేముల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రేమను మాటల ద్వారా కాదని, చర్యల ద్వారా చూపించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు