ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలి: అచ్చంపేట ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్, 18 జనవరి (హి.స.) ప్రతి గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను త్వరితగతిన చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులకు ఆదేశాలు
అచ్చంపేట ఎమ్మెల్యే


నాగర్ కర్నూల్, 18 జనవరి (హి.స.) ప్రతి గ్రామ పంచాయతీలలో

పారిశుద్ధ్య పనులను త్వరితగతిన చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాల్లో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీ పాలకవర్గాలతో కలిసి గ్రామాల్లో గత కొన్ని రోజుల నుండి ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక సర్పంచులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ పనులపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande