
ఖమ్మం, 18 జనవరి (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో సీపీఎం నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. అర్ధరాత్రి వేళ సీపీఎం నాయకుల ఇంటికి వెళ్లిన పోలీసులు.. పడుకున్న వారిని నిద్రలేని తీసుకెళ్లారు.
కాగా, ఈ అక్రమ అరెస్టులను సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. తాము ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు పిలుపు ఇవ్వకపోయినా అర్ధరాత్రి వేళ పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు