
హైదరాబాద్, 18 జనవరి (హి.స.)
సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ సీజన్లో ప్రయాణికుల రద్దీ.. సంస్థకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల్లోనే ఆర్టీసీకి చార్జీల ద్వారా రూ.67.40 కోట్ల మేర ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. ఐదు రోజుల్లో ప్రత్యేక బస్సులు కూడా నడుపడంతో రోజూ సగటున రూ.13.48 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. అంతకుముందు ఆర్టీసీ కి రోజువారీ సగటు ఆదాయం రూ.10.78 కోట్లుగా ఉండేది. సాధారణ రోజులతో పోలిస్తే స్పెషల్ బస్సులతో రోజూ అదనంగా సుమారు రూ.2.70 కోట్లు ఆదాయం వచ్చింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు