
యాదాద్రి భువనగిరి , 18 జనవరి (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అంత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని.. పశువుల మంద, వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. పులి సంచారానికి సంబంధించి ఎవరైనా అనుమానాస్పదంగా గమనిస్తే వెంటనే తుర్కపల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు