సీఎం మేడారం పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు.. ములుగు ఎస్పి
మేడారం, 18 జనవరి (హి.స.) మేడారంలో నేడు ముఖ్యమంత్రి పర్యటిస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ నుండి వచ్చే వాహనాలు ములుగు పస్రా నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారంకు మళ్లించారు. తాడ్వాయి మీదుగా అనుమతి నిలిపివేశారు. భక్తులు తిరుగు ప్ర
ములుగు ఎస్పి


మేడారం, 18 జనవరి (హి.స.)

మేడారంలో నేడు ముఖ్యమంత్రి పర్యటిస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ నుండి వచ్చే వాహనాలు ములుగు పస్రా నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారంకు మళ్లించారు. తాడ్వాయి మీదుగా అనుమతి నిలిపివేశారు. భక్తులు తిరుగు ప్రయాణం బయ్యక్కపేట భూపాలపల్లి పరకాల గుండెప్పాడ్ మీదుగా వరంగల్ చేరుకోవాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలు అనుసరించి ప్రశాంతమైన దర్శనం చేసుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని కోరారు. భక్తులు పోలీసులకు సహకరించవలసిందిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande