విశాఖపట్నాన్ని గ్లోబల్.కే పబులిటీ సెంటర్ల హబ్.గా మార్చాలని ప్రభుత్వ ప్రయత్నం
విశాఖ 18 జనవరి (హి.స.)విశాఖపట్నాన్ని గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాకారమవుతోంది. జపాన్‌కు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘ఇసాయ్‌’ విశాఖలో తొలి జీసీసీని మార్చిలో ప్రారంభించనుంది. ఈ సంస్థ ఇప
విశాఖపట్నాన్ని గ్లోబల్.కే పబులిటీ సెంటర్ల హబ్.గా మార్చాలని ప్రభుత్వ ప్రయత్నం


విశాఖ 18 జనవరి (హి.స.)విశాఖపట్నాన్ని గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాకారమవుతోంది. జపాన్‌కు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘ఇసాయ్‌’ విశాఖలో తొలి జీసీసీని మార్చిలో ప్రారంభించనుంది. ఈ సంస్థ ఇప్పటికే విశాఖకు 35 కిలోమీటర్ల దూరంలోని పరవాడ రాంకీ ఫార్మా సిటీలో 2009 నుంచి మందులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ పాలసీ ప్రకటించగానే తామూ సంస్థ ఏర్పాటు చేస్తామని ముందుకువచ్చింది. అది మార్చిలో ప్రారంభం కానుందని ఐటీ వర్గాలు తెలిపాయి. దీని తర్వాత జపాన్‌కే చెందిన నిప్పన్‌ టెలిగ్రాఫ్‌ అండ్‌ టెలిఫోన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీటీ) కూడా విశాఖలో జీసీసీని ప్రారంభించనుంది. మొబైల్‌, ఇంటర్నెట్‌, ఐటీ, కన్సల్టెన్సీ, ఏఐ, ఫొటోనిక్స్‌ రంగాల్లో ఈ సంస్థ 190 దేశాలకు సేవలు అందిస్తోంది. 70 దేశాల్లో కార్యాలయాలున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande