
హైదరాబాద్, 18 జనవరి (హి.స.)
హైదరాబాద్లో విమానాల పండుగ రాబోతున్నది. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు'వింగ్స్ ఇండియా 2026' పేరుతో బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో నిర్వహించనున్నారు. 'దేశీయ విమానయానం: భవిష్యత్తుకు బాటలు వేయడం.. రూపకల్పన నుంచి అమలు వరకు, తయారీ నుంచి నిర్వహణ వరకు, సమ్మళితత్వం నుంచి ఆవిష్కరణ వరకు, భద్రత నుంచి సుస్థిరత వరకు' అనే నినాదంతో జరిగే ఈ ఏవియేషన్ షోను పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఎఐసీసీఐ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు విమానయాన రంగానికి చెందిన దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, విమాన తయారీ సంస్థలు హాజరుకానున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు