సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేశ్ పాదయాత్ర
అమరావతి, 18 జనవరి (హి.స.) ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (Nara Chandra Babu Naidu) తనకున్న అచంచలమైన అభిమానాన్ని చాటుకుంటూ ఆయన
bandla-ganesh-padayatra-for-cm-chandrababu-515104


అమరావతి, 18 జనవరి (హి.స.)

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (Nara Chandra Babu Naidu) తనకున్న అచంచలమైన అభిమానాన్ని చాటుకుంటూ ఆయన 'సంకల్ప పాదయాత్ర'కు (Sankalpa Padayatra) శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న కష్టకాలంలో ఆయన క్షేమంగా బయటపడి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బండ్ల గణేష్ తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు భారీ విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో, తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ ఈ పాదయాత్ర చేపట్టారు. సంకల్ప యాత్ర పేరిట సాగనున్న ఈ పాదయాత్ర జనవరి 19వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఆయన స్వగృహం నుండి ప్రారంభం కానుందని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande