
హైదరాబాద్ , 18 జనవరి (హి.స.)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి 30ఏళ్లు అయినా ఆయన ప్రజల హృదయాల్లో బతికే ఉంటారన్నారు. తెలుగు చిత్రసీమలో అనేక రకాల పాత్రలు పోశించి అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగానూ నటించి మెప్పించారన్నారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరవాత కేవలం అధికారం కోసమే రాజకీయాలు కాదని ప్రజాసంక్షేమం కోసమే రాజకీయాలు అని చాటిచెప్పేలా చేశారన్నారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయన్నారు. కాస్త మార్పులు జరిగినా ఆ పథకాలను ఎవరూ తీసివేయలేదన్నారు. రూపాయికే కిలో బియ్యం, రైతులకు రూ.50కి విద్యుత్, మాండలిక వ్యవస్థ, మహిళలకు చదువు లాంటి పథకాలన్నీ ఎన్టీఆర్ గట్టిగా సంకల్పించి ప్రవేశపెట్టారన్నారు. ఈ ప్రథకాలు ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV