
గొల్లపూడి, 18 జనవరి (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి.. నట సార్వభౌమ ఎన్టీఆర్ (NTR) ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఆయనే పోటీ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడిలోని కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. నటన నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహనీయుడని వివరించారు. ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ కు మాత్రమే దక్కిన అరుదైన వరం అని పొగిడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV