
అమరావతి, 18 జనవరి (హి.స.)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. తన తాతయ్యను స్మరించుకుంటూ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకమని, ఆయనో మహానాయకుడని కొనియాడారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు మనవడైన మంత్రి నారా లోకేశ్ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఆప్యాయతను తెలియజేసేలా ఎక్స్ వేదికగా భావోద్వేగాన్ని ప్రజలతో పంచుకున్నారు.
భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా! అంటూ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. ఆయన పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ మాత్రమే దక్కిన అరుదైన గౌరవం అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మహా నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడుతూ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ప్రత్యక్షంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఎన్టీఆర్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV